Friday 8 April 2011

ప్చ్.... తెలుగుకు తెగులు...!

 ఇది మన భాషకు కొత్తగా సోకిన జాడ్యమేమీకాదు. అయితే... ఇటీవల మరింత ముదిరిపోయిందనిపిస్తోంది. ప్రత్యేకించి టీవీ చానెళ్లలో..!  ‘చెప్పారు’ను ‘అప్పారావు’కు మల్లే పలకడంలాంటి ఉచ్ఛారణ దోషాలు ఇటీవల మరీ మామూలైపోయానుకోండి..! అయితే... ఇటీవల ఓ చానెల్లో వస్తున్న పోగ్రామ్ వీటన్నింటిని తలదన్నే స్థాయిలో కొనసాగుతోంది.  నిజానికి ఆ కార్యక్రమంలో విభిన్నరంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులను సరికొత్త రీతిలో పరిచయం చేయడం బాగుంటుంది. కానీ... యాంకర్ ప్రజెంటేషనే కాస్త డిఫరెంట్ (ఎబ్బెట్టుగా అంటేనే బాగుంటుందేమో)గా సాగుతుంది.  ‘చెప్పారు’ను,  చ్యెప్యార్రు’ అని పలకడం.... ‘ప్రేమతో...’ను, ప్య్రేర్రేర్రేర్రేమతో’ అనడం... ‘లక్ష్మీ’ని,  ‘ల్యక్ష్యిమి’ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నెన్నో..! వ్యాసాల్లోగానీ... వ్యాఖ్యానాల్లోగానీ ఆంగ్లపదాలు వాడడం  ఇటీవల మామూలైపోయింది. ఇది తప్పేం కాదు. వీక్షకులు (పాఠకులు కూడా) ఆస్వాదిస్తున్నారు కూడా.  కానీ... తెలుగు, ఇంగ్లీషులను ఉచ్ఛరించేక్రమంలో వాటి సహజత్వాన్ని అతిక్రమించకూడదు కదా? కానీ.. సదరు కార్యక్రమంలో యాంకరమ్మ రెంటినీ కలగాపులగం చేస్తూ వీక్షకులతో చెడుగుడాడేసుకుంటున్నారు. తెలుగును అడ్డంగా ఖూనీ చేస్తున్నారు. అయితే... భయమంతా  ఈ యాంకరమ్మ ప్రజెంటేషన్ ఆఫ్ స్టయిల్ ఓ ట్రెండ్ సెట్టర్ కాదు కదా? అనేదే..!
కొసమెరుపు:  ‘వాల్డ్‌కప్‌లో సచిన్ ఆరో సెంచరీ’.... మురళీధరన్‌కు ఇదే చివరి వాల్డ్‌కప్’....  ఇటీవల ముగిసిన వరల్డ్‌కప్‌లో భాగంగా కొన్ని న్యూస్ చానెళ్లలో ఇలాంటి స్క్రోలింగ్‌లు చూశాం.  ‘వరల్డ్‌కప్’ అనే పదాన్ని యథాతథంగా ఉచ్ఛరిస్తారని కాబోలు... కొన్ని చానెళ్లు స్క్రిప్ట్‌లోనే ’వాల్డ్‌కప్’ అని రాస్తూ జాగ్రత్త పడ్డాయి. ఈ ప్రయోగం ఆలోచింపజేసే విధంగా ఉన్నా, ఆయా చానళ్లలో మున్ముందు ఇలాంటివే మరికొన్నింటిని చూడొచ్చేమో అనిపిస్తోంది.   ఇంతకుముందే చెప్పుకున్నట్టు... ‘చెప్పారు’ను ‘అప్పారావు’కు తేడాలేకుండా పలకడంలోని ఇబ్బందిని అధిగమించొచ్చు. అంటే... ‘చంద్రబాబు చెప్ప్యారు’, ‘రోశయ్య చెప్ప్యారు’ అని స్క్రోలింగ్ వచ్చినా ఆశ్చర్యం లేదేమో..!

Saturday 26 March 2011

కాగలకార్యం కివీస్ తీర్చిందా?

మొత్తానికి వరల్డ్‌కప్ నాకౌట్ దశ దక్షిణాఫ్రికాకు మరోసారి కలిసిరాలేదు. నిజానికి ఈ ఫలితం ఎవరూ పెద్దగా ఉహించనిది.  కారణం... నాకౌట్ దశలో సఫారీలకు ఒత్తిడి సహజమే అయినా...  వారికి ఈ మారు క్వార్టర్స్‌లో న్యూజిలాండ్ రూపంలో సాదాసీదా ప్రత్యర్థి ఎదురవడమే అది. అందుకేనేమో.... ఈ మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా పూర్తి ఏకపక్షం చేస్తుందనే విశ్లేషణలు... కథనాలు.. సర్వత్రా వినిపించాయి.  కాకపోతే... ఒత్తిడిని అధిగమిస్తేనే... అన్న ఓ ముక్తాయింపు తప్ప..! కానీ.. చివరికి ఆ ఒత్తిడి జాడ్యమే మరోసారి దక్షిణాఫ్రికాపై అధిపత్యం చెలాయించింది. ఆడుతూపాడుతూ ఛేదించాల్సిన నాలుగు పైచిలుకు రన్‌రేట్‌ను కూడా అధిగమించక చతికిలపడాల్సొచ్చింది. కానీ..  ఫైనల్ స్థానంపై గంపెడాశతో ఉన్న భారత్‌కు తాజాగా దక్షిణాఫ్రికా నిష్ర్కమణ మరింత కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.  గురువారం క్వార్టర్స్‌లో గట్టిపిండం ఆస్ట్రేలియాపై సాధించిన సంచనల విజయం భారత్‌పై అంచనాలను మరింత పెంచింది. ఇదే ఊపులో సెమీస్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసి ఫైనల్ చేరితే....  అక్కడ మన ప్రత్యర్థి ఎవరనే అంచనాలు అప్పటికే మొదలయ్యాయి కూడా. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు మన చేతుల్లోనే వీడ్కోలు సన్మానం జరగడంతో బహుశా  ఇక ఆ జట్టు అయితేగియితే దక్షిణాఫ్రికా కావొచ్చేమో అనిపించింది. భారత్‌కు విజయాల పరంగా ఇటీవల మిగిలిన జట్ల (శ్రీలంక, ఇంగ్లండ్, న్యూజిలాండ్)పై చక్కని రికార్డు ఉండడం, సఫారీలపై లేకపోవడమే ఇందుకు కారణమేమో..!  కానీ... ఆ జట్టూ  రేసులోంచి వైదొలిగిందిపుడు. ఇటీవల వన్డేల్లో దక్షిణాఫ్రికా భారత్‌పై చక్కని ప్రదర్శన కనబరిచింది.  వరల్డ్‌కప్ ఆరంభానికి ముందు జరిగిన వన్డే సిరీసే ఇందుకు నిదర్శనం. ఆ సిరీస్‌లో భారత్ గట్టిపోటీనిచ్చినా తుదకు సిరీస్‌లో 2-3తో ఓటమి చవిచూడాల్సొచ్చింది. పైగా తాజా వరల్డ్‌కప్ గ్రూప్‌దశ సమరంలోనూ మనపై వారిదే పైచేయి అయింది. గెలుస్తామనుకున్న మ్యాచ్ కాస్తా వారు ఎగరేసుకుపోయారు.  సో... భారత్ ఫైనల్ చేరి, అక్కడ ప్రత్యర్థి దక్షిణాఫ్రికా ఉండివుంటే... కచ్చితంగా సీన్ మరింత టెన్షన్‌గా ఉండేదే..! ఈ రకంగా చూస్తే, సఫారీలను ఇంటి ముఖం పట్టించడం ద్వారా న్యూజిలాండ్ జట్టు భారత్‌కు మేలే చేసిందేమో..! కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చడమంటే ఇదేనేమో..! 

Wednesday 9 March 2011

haiiiiiiii.

మిత్రులకు, సన్నిహితులకు స్వాగతం....